హైదరాబాద్ లో కరోనా.. సూపర్ హ్యాపీ అంటున్న అనసూయ..!

హైదరాబాద్ లో కరోనా కలకలం అందరికి తెలిసిందే. ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కు వచ్చిన ఈ కరోనా ఎఫెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మొదలైంది. తెలంగాణా, ఏపి ప్రభుత్వాలు కరోనా గురించి ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఓ పక్క హైదరాబాద్ జనాలు కరోనాతో భయపడుతుంటే హాట్ యాంకర్ అనసూయ మాత్రం కరోనా వల్ల తను హ్యాపీగా ఉంటుందని చెబుతుంది.

కరోనా వల్ల అనసూయ ఇంట్లోనే టైం గడుపుతుందట.. పిల్లలతో కలిసి హాయిగా ఉంటున్నా అని ట్వీట్ చేసింది అనసూయ. తనకు ఇష్టమైన అవెంజర్స్ ఎండ్ గేమ్ మళ్ళీ చూశానని అన్నది అనసూయ. ఫ్యామిలీతో టైం దొరికినందుకు సంతోషపడుతుంది అమ్మడు. అనసూయ చేసిన ట్వీట్ కు కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారు.