ఇస్మార్ట్ బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్..!

ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు టాలీవుడ్ లో లక్కీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే చేతిలో రెండు మూడు సినిమాలు ఉండగా మరో క్రేజీ ఆఫర్ అమ్మడి చెంతకు చేరింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు. 

ప్రస్తుతం రవితేజ చేస్తున్న క్రాక్ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న నిధి అగర్వాల్ రాబోయే రోజుల్లో స్టార్ రేసులో నిలిచేలా ఉంటుంది. ఇస్మార్ట్ హిట్ తో కెరియర్ లో మొదటి హిట్ అందుకున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో హంగామా చేస్తుంది.