నిఖిల్ తో సుకుమార్ '18 పేజెస్'

యువ హీరో నిఖిల్ అర్జున్ సురవరం తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి సూపర్ హిట్ సినిమా సీక్వల్ కార్తికేయ 2 కాగా మరొకటి 18 పేజెస్. కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ ఈ సీక్వల్ మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్తికేయ 2 నుండి రిలీజ్ చేసిన వీడియోకి భారీ స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటుగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిఖిల్ హీరోగా సినిమా వస్తుంది.

సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో కుమారి 21ఎఫ్ డైరెక్ట్ చేసిన సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ మూవీకి 18 పేజెస్ టైటిల్ ఫిక్స్ చేశారు. చూస్తుంటే సుకుమార్ మళ్ళీ యూత్ ను ఆకట్టుకునే కథతోనే వచ్చేలా ఉన్నాడని అనిపిస్తుండ్. ఇన్నాళ్ళు ఎలాంటి సపోర్ట్ లేకుండానే సోలోగా చేసిన నిఖిల్ గీతా ఆర్ట్స్ అండతో కొత్త సినిమా వస్తుంది. ఈ సినిమా హిట్ అయితే నిఖిల్ కూడా స్టార్ లీగ్ లోకి వచ్చేసినట్టే.