
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడవ సినిమా మొదలైన విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే సినిమాలో అంజలి ఉన్న మాట వాస్తవమే కాని ఆమె సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
లీడ్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే వెంకటేష్ తో ఎఫ్-2 లో జోడీ కట్టిన ఈ అమ్మడు బాలకృష్ణ సినిమా అంటే అభ్యంతరమేమి చెప్పలేదట కాని రెమ్యునరేషన్ మాత్రం భారీగా అడుగుతుందట. ప్రస్తుతం సీనియర్ స్టార్స్ తో మాత్రమే నటిస్తున్న తమన్నా 70 లక్షలు మాత్రమే తీసుకుంటుంది. అయితే బాలయ్య సరసన చేయాలంటే మాత్రం కోటికి పైగా డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం గోపీచంద్ సీటీమార్ సినిమాలో నటిస్తున్న తమన్నా అడిగినంత ఇచ్చి బాలకృష్ణ సినిమాలో తీసుకోవాలని చూస్తున్నారు.