‘మా’ కొత్త అధ్యక్షుడు బెనర్జీ..!

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కొత్త అధ్యక్షుడిగా నటుడు బెనర్జీని ఎంచుకున్నారు. ఈమధ్యనే కదా నరేష్ మా అధ్యక్షుడిగా గెలిచారు.. అంతలోనే ఆయన పదవి ఊడిందా అంటే. నిజం చెప్పాలంటే నరేష్ మా అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుండి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఫైనల్ గా మా అధ్యక్షుడిగా బెనర్జీని ఎన్నుకున్నారు. 

ఈరోజు ఉదయం మా అసోషియేషన్ క్రమశిక్షణ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చిరంజీవి అటెండ్ అయ్యారు. చిరంజీవితో పాటుగా కృష్ణంరాజు, మురళి మోహన్, జయసుధ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. నరేష్  41 రోజులు సెలవులో ఉండటం వల్ల అప్పటివరకు తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీని ఎన్నుకున్నట్టు ప్రకటించారు. మరి  41 రోజుల తర్వాత నరేష్ ను తిరిగి అధ్యక్షుడిగా నియమిస్తారా లేక బెనర్జీని కొనసాగిస్తారా అన్నది చూడాలి.