
రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా డైరక్షన్ లో వస్తున్నా సినిమా ఒరేయ్ బుజ్జి. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. టీజర్ లో కథ రొటీన్ గా అనిపించినా ఎంటర్టైన్ చేసేలా ఉందని చెప్పొచ్చు.
గుండెజారి గల్లతయ్యిందే.. ఒక లైలా కోసం సినిమాల తర్వాత విజయ్ కుమార్ కొండా డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయాగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని రాజ్ తరుణ్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రాజ్ తరుణ్, హెబ్బా లక్కీ జోడీ క్రేజ్ ఈ సినిమాకు సూపర్ బజ్ తెచ్చేలా ఉంది. మార్చి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నాని 'వి' సినిమాకు పోటీగా వస్తుంది.