
పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందుల వాళ్ళ కెరియర్ లో కూడా వెనుకపడ్డ మంచు మనోజ్ మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈసారి హీరోగానే కాదు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు మంచు మనోజ్. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరక్షన్ లో మంచు మనోజ్ చేస్తున్న సినిమా అహం బ్రహ్మస్మి. రీసెంట్ గా టైటిల్ పోస్టర్ తోనే సర్ ప్రైజ్ చేసిన మనోజ్ ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ తో షాక్ ఇచ్చాడు. టైటిల్ కు తగినట్టుగానే అహం బ్రహ్మస్మిలో మనోజ్ లుక్ ఉంది.
మనోజ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి తన సత్తా చాటేలా ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉంది. చూస్తుంటే అహం బ్రహ్మస్మి తెలుగు పరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించేలా ఉంది. అహం బ్రహ్మస్మి ఫస్ట్ లుక్ పై మంచు ఫ్యాన్స్ నుండే కాదు సిని ప్రియుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. అసలు కాన్సెప్ట్ ఏంటి అన్నది చిత్రయూనిట్ త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.