
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలకు వచ్చిందని తెలుస్తుంది. ఇప్పటికే వైరస్ సోకినట్టుగా అనుమానం ఉన్న వారికి టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా కొరోనా వైరస్ భయపడేలా చేస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అందరు సూచనలు ఇస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా తమకు తెలిసిన విషయాన్ని తమ సోషల్ బ్లాగుల్లో షేర్ చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం ముఖానికి మాస్క్ ధరించి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. జాన్ మూవీ షూటింగ్ కోసం యూరప్ వెళ్తున్న ప్రభాస్ మాస్క్ తో కనిపించడంతో కచ్చితంగా ఇది కొరోనా ఎఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు.
ప్రభాస్ మాత్రమే కాదు పబ్లిక్ ప్లేసులలో తిరిగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే బెటర్ అని అంటున్నారు. వైరస్ ప్రభావం ఉదృతం కాకూడదని తెలంగాణా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మెగాస్టార్ కోడలు ఉపాసన కొరోనా రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఒ వీడియో కూడా షేర్ చేసింది. మహేష్ కూడా కొరోనా బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సినవి.. చేయకూడనివి అంటూ ఒక పిక్ షేర్ చేశాడు.