ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు ఆచార్య టైటిల్ ప్రచారంలో ఉంది.. అయితే రీసెంట్ గా ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చిరంజీవి సినిమా టైటిల్ ను ఆచార్య అని ఎనౌన్స్ చేయడం విశేషం. టైటిల్ చెప్పాక టంగ్ స్లిప్ అయ్యానని గుర్తించాడు చిరు. ఇక ఇదిలాఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు అన్న వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. 

సినిమాలో మహేష్ ఉన్నాడా లేడా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక లేటెస్ట్ గా ఆచార్య మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఖైది నంబర్ 150తో సూపర్ హిట్ అందుకున్న చిరు ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాడు. రాబోతున్న ఆచార్య కూడా చిరు ఖాతాలో మరో హిట్ పడుతుందని అంటున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.