
రీసెంట్ గా జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్క అవుట్ అవలేదు. శర్వానంద్, సమంత ఇద్దరు కూడా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. అయినా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్న శర్వానంద్ తన తర్వాత సినిమా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో రెడ్ మూవీ చేస్తున్న కిశోర్ తిరుమల ఆ సినిమా తర్వాత శర్వానంద్ తో మూవీ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ చేశారట. పడి పడి లేచే మనసు సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు మళ్లీ కలిసి జోడీ కడుతున్నారు. పడి పడి లేచే మనసు నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.