ఛార్మికి కరోనా దెబ్బ..!

హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ ఎప్పుడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది. అయితే చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణాకు వ్యాపించడం జరిగింది. దీనిపై తెలంగాణా ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. చాలా సీరియస్ మ్యాటర్ అయిన ఈ విషయంపై ఛార్మి కామెడీ చేసి అడ్డంగా బుక్ అయ్యింది. కరోనా వైరస్ మీద ఛార్మి ఓ టిక్ టాక్ వీడియో చేసింది. కరోనా వైరస్ ఢిల్లి, తెలంగాణాకి వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ గైస్.. కరోనా వైరస్ అరైవ్ అంటూ వీడియో షేర్ చేసింది.

అయితే ఇంత సీరియస్ మ్యాటర్ పై ఇలా సిల్లీగా స్పందించిన ఛార్మిపై నెటిజెన్లు మండిపడుతున్నారు. అయితే విషయం గ్రహించిన ఛార్మి ఆ ట్వీట్ డిలీట్ చేసింది. ప్రస్తుతం చాలా సెన్సిటివ్ అంశమైన కరోనా వైరస్ మీద ఇలా కామెడీగా ట్వీట్ చేయడం పట్ల ఛార్మిని అందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పూరితో కలిసి ఛార్మి విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ నిర్మిస్తున్నారు.