అనుష్కతో 'ఏమాయ చేసావే' సీక్వల్..?

గౌతం మీనన్ డైరక్షన్ లో సమంత డెబ్యూ మూవీగా వచ్చిన ఏమాయ చేసావే మూవీ ఈమధ్యనే పదేళ్లు పూర్తి చేసుకుంది. చైతు, సమంత బంధానికి మూలం ఆ సినిమానే అని మనకు తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళంలో శింబు, త్రిష కలిసి చేశారు. అక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో గౌతం మీనన్ ఏమాయ చేసావే సీక్వల్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఈ సీక్వల్ సినిమాలో శింబుతో పాటుగా అనుష్కని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. స్వీటీ అనుష్కకు ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తిగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఒకవేళ అనుష్క ఏమాయ చేసావే సీక్వల్ చేస్తే ఆమె కోసమైనా సినిమా చూసే అవకాశం ఉంటుంది. మరి ఏమాయ చేసావేలో చైతు, సమంతల ముద్దుముచ్చట్లు అందరికి తెలిసిందే. మరి శింబుతో అనుష్క అలా లిప్ లాక్స్ కు సహకరిస్తుందా లేదా అన్నది చూడాలి.