
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ తో తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో బన్ని సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సుకుమార్ సినిమా ఓ పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే బన్ని ఇంకా ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ అవలేదు.
ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ గడుపుతున్న బన్ని తన గారాల పట్టి అర్హాతో ఆడుకుంటున్న వీడియో ఒకటి షేర్ చేశాడు. అల్లు అర్జున్ ను అర్హా ముద్దుగా 'బే' అని పిలవడం.. దానికి బన్ని కూడా తన కూతురుని నన్నే 'బే' అంటావేరా అని ఆటలాడటం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల వైకుంఠపురములో సాంగ్స్ ప్రోమోలో, మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, అర్హాలు సందడి చేశారు.