
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా టైటిల్ గా వకీల్ సాబ్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ సూపర్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కొన్నాళ్లుగా మీడియాలో చర్చల్లో ఉన్న వకీల్ సాబ్ టైటిల్ నే ఫైనల్ చేసింది చిత్రయూనిట్.
పవన్ స్టైలిష్ లుక్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. రెండేళ్లుగా పవన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఈ పోస్టర్ తో పండుగ చేసుకుంటున్నారు. మేలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్టర్ అంచనాలు పెంచగా ఆల్రెడీ సూపర్ హిట్టైన సబ్జెక్ట్ కాబట్టి పవన్ వకీల్ సాబ్ గా సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్.