
మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు. సినిమా వచ్చి రెండేళ్లు అవుతుండగా లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ వైజయంతి బ్యానర్ లో భారీ మూవీ ఎనౌన్స్ చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సినిమా ఫిక్స్ చేశారు. సైన్స్ ఫిక్షన్ కథగా వస్తున్న ఈ సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ మూవీ పాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునేని సెలెక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో కూడా బాలీవుడ్ లో బాక్సాఫీస్ షేక్ చేశాడు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాను నెక్స్ట్ లెవల్ లో తీస్తున్నారని తెలుస్తుంది. హీరోయిన్ గా దీపిక ఫైనల్ అయితే అమ్మడిని టాలీవుడ్ కు తీసుకొచ్చిన క్రెడిట్ ప్రభాస్ ఖాతాలో చేరుతుంది.