
నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో సూపర్ సక్సెస్ అయిన మూవీ కార్తికేయ. మొదటి సినిమానే అయినా దర్శకుడు చందు మొండేటి గ్రిప్పింగ్ గా ఈ సినిమా తీశాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ పెద్దలను సైతం ఆశ్చర్యపరచిన చందు మొండేటి. ప్రేమం తెలుగు రీమేక్ తో కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత నాగ చైతన్యతో సవ్యసాచి సినిమా చేశాడు. సవ్యసాచి టైటిల్.. సినిమా కాన్సెప్ట్ అంచనాలు పెంచగా రిలీజ్ తర్వాత అదో డిజాస్టర్ మూవీగా మిగిలింది.
నిఖిల్ కూడా కార్తికేయ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని తగిన ఫలితాన్ని అందుకోలేదు. అందుకే మళ్లీ ఈ ఇద్దరు కలిసి కార్తికేయ 2 ప్లాన్ చేశారు. దైవం మానుష్య రూపేణా అంటూ సినిమా కాన్సెప్ట్ తెలియచేసేలా వచ్చిన ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. హీరోగా నిఖిల్, డైరక్టర్ చందు ఇద్దరు కలిసి క్రేజీగా చేస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.