
ప్రముఖ నటుడు బ్రహ్మాజి తనయుడు సంజయ్ హీరోగా చందు ముద్ద డైరెక్ట్ చేసిన సినిమా ఓ పిట్ట్ కథ. పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 6న రిలీజ్ అవనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో నిత్య, విశ్వంత్, బ్రహ్మాజిలు ఈ మూవీలో నటించారు. ఈవెంట్ లో మాట్లాడిన చిరు సంజయ్ నేవి ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చాడని తెలిసింది. తను కూడా నేవిని వదులుకుని వచ్చాను. బ్రహ్మాజి వంటి నటుడు ఇంట్లో ఉండటం సంజయ్ అదృష్టం. ఈ సినిమాలో నటించిన అందరికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు చిరంజీవి.
ఇక ఈమధ్య చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు.. దయచేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరు చిన్న సినిమాలకు అదరించాలని కోరారు చిరంజీవి. నటీనటుల విషయానికి వస్తే ఇండస్ట్రీలో సానుకూల దృక్పథం చాలా అవసరం. ఎలాంటి కష్టాలు వచ్చినా దృఢంగా ఉండే వాళ్లే ఇక్కడ ఉండగలుగుతారు. కొత్తతరం నటులకు ఇది చాలా అవసరమని అన్నారు చిరంజెవి.
ఈ వేడుకలో మాట్లాడుతూ కొరటాల శివ డైరక్షన్ లో తను చేస్తున్న సినిమా ఆచర్య అని పొరపాటున సినిమా టైటిల్ చెప్పేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరు అలా సినిమా టైటిల్ చెప్పగానే అక్కడ ఉన్నవాళ్లంతా ఈలలు గోఅలతో అల్లరి చేశారు. సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కు డైరక్టర్ కొరటాల శివ ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. కాని తను పొరపాటున టైటిల్ ఎనౌన్స్ చేసినందుకు కొరటాల శివకు సభాముఖం గానే సారీ అని చెప్పారు చిరంజీవి.