ఆర్టీసి బస్సులో భీష్మ పైరసీ.. కేటిఆర్ ఏమన్నారంటే..!

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా రిలీజై వారం రోజులే అవుతుంది. ఈలోగానే ఈ సినిమా పైరసీ ప్రింట్ వచ్చేసింది. సినిమా రిలీజైన రోజే పైరసీ అవడం.. ఆ ప్రింటులు బయట దొరకడం కామనే. అయితే ఈ పైరసీ ప్రింట్ ఆర్టిసీలో ప్లాన్ చేయడం హాట్ న్యూస్ గా మారింది. హైదరాబాద్ నుండి బయటలు దేరిన TSRTC బస్ లో భీష్మ పైరసీ ప్రింట్ చూసి అవాక్కైన సిని అభిమాని వెంటనే దాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టాడు.     

అతను పెట్టిన వీడియో చూసి వెంటనే ఫిల్మ్ చాంబర్ లో యాంటి పైరసీ సెల్ కు కంప్లైంట్ చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆల్రెడీ ఈ పైరసీ లింక్ ను బ్లాక్ చేయడం.. లీక్ చేసిన వారి మీద విచారణ జరిపించడం జరుగుతుంది. అయితే ఈ విషయంపై భీష్మ డైరక్టర్ వెంకీ కేటిఆర్ కు ఫిర్యాదు చేశారు. వెంకీ రిక్వెస్ట్ కు రిప్లైగా ఇక మీదట ఇలా జరుగకుండా రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు కేటిఆర్.. ఆర్టిసి బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులకు సూచించారు.