ఎన్టీఆర్ 30.. రష్మిక వర్సెస్ పూజా హెగ్దే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అరవింద సమేత తర్వాత ఎన్.టి.ఆర్, త్రివిక్రం కలిసి చేసే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారన్న విషయంపై సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న, పూజా హెగ్దె ఈ ఇద్దరిలో ఒకరు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తారని తెలుస్తుంది.       

డైరక్టర్ త్రివిక్రం పూజా హెగ్దే కావాలని అంటుంటే నిర్మాతలు మాత్రం రష్మిక మందన్న్న వైపు మొగ్గు చూపిస్తున్నారట. పూజా హెగ్దే యాక్టింగ్ కన్నా గ్లామర్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. రష్మిక మాత్రం ఎలాంటి పాత్ర అయినా సరే రఫ్ఫాడించేస్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ సరిలేరుతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక లేటెస్ట్ గా భీష్మ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.  

ఎన్.టి.ఆర్ సరసన అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దే నటించింది. మరి ఈసారి కూడా ఆమెను రిపీట్ చేస్తారా లేక రష్మికను సెలెక్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.