వినాయక్ డైరక్షన్ లో చిరంజీవి

డైరక్టర్ గా సినిమాలు మానేసి హీరోగా సీనయ్య మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా తెలియలేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వి.వి.వినాయక్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారట. ఆయన డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. చిరు 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత చిరు మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. 

ఈ సినిమా డైరక్షన్ ఛాన్స్ వినాయక్ కు ఇస్తున్నారట. మెగాస్టార్ వినాయక్ కాంబోలో రీమేక్ సినిమాలు మంచి హిట్ సాధించాయి. అప్పట్లో రమణ రీమేక్ గా వచ్చిన ఠాగూర్.. రీసెంట్ గా కత్తి రీమేక్ గా వచ్చిన ఖైది నంబర్ 150 ఈ రెండు సినిమాలు వినాయక్ డైరెక్ట్ చేసినవే. రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే లూసిఫర్ రీమేక్ కు వినాయక్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. మరి హీరో వినాయక్ మళ్లీ డైరక్షన్ చేయడం అంటే ఒక్క సినిమాకే హీరోగా చాలని అనుకున్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు.