
బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అంధాధున్ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్నాడు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు చేయాల్సిన పాత్రకు హాట్ యాంకర్ అనసూయని ఎంపిక చేశారట. అంధాధున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో టబు కూడా ఈ సినిమాలో నటించింది. ఆ సినిమా రీమేక్ గా వస్తున్న తెలుగు సినిమాలో కూడా టబుని నటించమని ఆఫర్ ఇచ్చారట. అయితే సినిమాలో నటించాలంటే కోటి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పిందట.
అందుకే కోటికి ఆమెకి ఇవ్వడం కన్నా అనసూయకు 10 లక్షలు ఇస్తే సరిపోతుందని ఆమెని సెలెక్ట్ చేశారట. భీష్మ సక్సెస్ తో సూపర్ ఫాం లో ఉన్న నితిన్ ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ సినిమాను ఈ సమ్మర్ కు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.