
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక క్రిష్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పవన్. ఈమధ్యనే సినిమాకు ముహుర్తం కూడా పెట్టారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపిస్తాడని తెలుస్తుంది.
సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తుంది. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ తో జతకట్టిన కీర్తి సురేష్ మరోసారి పవన్ సరసన నటిస్తుంది. మహానటితో తెలుగులో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం మిస్ ఇండియా మూవీలో నటిస్తుంది. పవన్ సినిమాలో కీర్తి సురేష్ లక్కీ ఛాన్స్ పట్టేసింది. మహానటి తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాని కీర్తి సురేష్ మళ్లీ తన మార్క్ చూపించాలని చూస్తుంది.