మాజీ లవర్ కు రష్మిక ఓకే చెబుతుందా

కన్నడ భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ సూపర్ జోష్ లో ఉంది. ఈ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమా చేసిన ఈ అమ్మడు ఆ రెండు సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగుతో పాటుగా కన్నడలో కూడా సినిమాలు చేస్తున్న రష్మిక తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో దూరమైన విషయం తెలిసిందే. 

పెళ్లి దాకా వెళ్లిన వీరి బంధం ఒక్కసారిగా బ్రేక్ అయ్యింది. ఆ తర్వాత రష్మిక రక్షిత్ ల మధ్య మాటలు కూడా లేవు. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాలో నటించిన ఈ జంట ఆ సినిమా హిట్ అవడంతో క్రీజీ జంటగా మారింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అవడం.. కొన్ని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కిరాక్ పార్టీ సీక్వల్ కథ సిద్ధమైందట. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. రక్షిత్ ఆఫర్ ఇచ్చినా సరే రష్మిక ఈ సినిమాకు ఓకే చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.