ప్రభాస్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ దశాబ్దంలో గుర్తుండిపోయే ప్రేమకథతో ఈ సినిమా వస్తుందట. ఈ సినిమాను అసలైతే ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని సినిమా రిలీజ్ డేట్ దసరాకి వాయిదా వేశారు. 

ఈ సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సినిమాకు రాధే శ్యామ్, ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ప్రభాస్ తో రాధాకృష్ణ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.