క్రేన్ నా మీద పడినా బాగుండేది..!

ఇండియన్ 2 షూటింగ్ లో 150 అడుగుల ఎత్తు నుండి క్రేజ్ కిందపడి ముగ్గురు చిత్రయూనిట్ ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఆ టైంలో శంకర్ అక్కడే ఉన్నా కొద్దిపాటి దెబ్బలతో బయటపడ్డారు. శంకర్ పర్సనల్ అసిస్టెంట్ తో పాటుగా మరో ఇద్దరు యూనిట్ సభ్యులు ఈ దుర్ఘటనలో మృతిచెందారు. ఈ ఘటన జరిగిన దగ్గర నుండి డైరక్టర్ శంకర్ ఎలా ఉన్నారు.. ఆయన ఎలా రెస్పాండ్ అవుతారన్న విషయం మీద చర్చలు జరిగాయి. కొందరైతే ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందా అన్న డౌట్ కూడా వ్యక్తపరిచారు.

అయితే లేటెస్ట్ గా ఆరోజు జరిగిన సంఘటన గురించి ట్వీట్ చేశారు శంకర్. ఆ ప్రమాదం జరిగినప్పటి నుండి తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నా అని.. ఆ ప్రమాదం నుండి తాను త్రుటిలో తప్పించుకున్నా.. తన అసిస్టెంట్, చిత్రయూనిట్ ని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆ క్రేన్ తన మీద పడినా బాగుండేదని అన్నారు శంకర్. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు శంకర్.