నాగ్ అశ్విన్ తో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అంటూ వార్తలు రాగానే లేటెస్ట్ గా మహానటి డైరెక్టర్ తో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. వైజయంతి బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ఎనౌన్స్ చేశారు. 

చూస్తుంటే అశ్వని దత్ ప్రభాస్ తో మరో బాహుబలి రేంజ్ లో సినిమా చేస్తాడని అనిపిస్తుంది. మహానటితో తన ప్రతిభ చాటుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా మరో సంచలనం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా గురించి మిగతా డిటైల్స్ త్వరలో తెలుస్తాయి.