
వెంకీ కుడుముల డైరక్షన్లో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో వెంకీ కుడుములను ఆటాడుకున్నాడు నితిన్. వెంకీ మాట్లాడుతున్న టైంలో మైక్ అందుకున్న నితిన్ ఇది నువ్వు రాసిన స్క్రిప్టేనా..? ఇది నువ్వు రాసిన కథేనా అంటూ మాట్లాడాడు.
నితిన్ ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. వెంకీ కుడుముల మొదటి సినిమా ఛలో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా హీరో నాగ శౌర్య ఆ సినిమా కథ తను రాశానని.. వెంకీకి అసలు ఏమి రాదన్నట్టు మాట్లాడాడు. అశ్వద్ధామ ప్రమోషన్స్ లో నాగ శౌర్య ఈ కామెంట్స్ చేయగా దానికి భీష్మ హిట్ తో సమాధానం ఇచ్చాడు వెంకీ. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ నితిన్ నాగ శౌర్య కామెంట్స్ మీద పంచ్ వేశాడు. నితిన్ సరదాకే అన్నా నాగ శౌర్య దీన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం మ్యాటర్ ఎక్కడికో వెళ్తుంది.