హీరో విజయ్ కు ఐటి షాక్..!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ కు ఐటి అధికారులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం మాస్టర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విజయ్ ను షూటింగ్ స్పాట్ లోనే ఐటి అధికారులు ఐదారు గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. మాములుగా ఐటి అధికారులు ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత రైడ్ చేస్తారు. కాని ఎలాంటి నోటీసులు లేకుండా విజయ్ పై ఐటి దాడులు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ సినిమా నిర్మాతలు ఏ.జి.ఎస్ బ్యానర్ ఆఫీస్ లో కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయపు పన్నుతో పాటుగా ఇతర ట్యాక్సులు సరిగా కట్టడం లేదనే ఫిర్యాధులు రావడం వల్ల విజయ్ ఇళ్ల మీద, ఆఫీస్ ల మీద దాడులు చేశారు. అయితే విజయ్ దగ్గ్ర నుండి కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.