
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను మారాల్సిన టైం వచ్చిందని.. తన కెరియర్ లో ఇదే చివరి ప్రేమ కథా చిత్రమని అన్నారు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు నుండి లాస్ట్ రిలీజ్ డియర్ కామ్రేడ్ వరకు కొత్త కథలతో వచ్చిన దేవరకొండ విజయ్ ఇక మీదట ప్రేమ కథల జోలికి వెళ్లనని అంటున్నాడు.
ఇక ప్రేమలోని అన్ని షేడ్స్ ను ఈ సినిమాలో చూస్తారు. ఫిబ్రవరి 14న ప్రేమకథతో నిండించిన ఈ సినిమాను మీరు చూస్తారు. నోటా తర్వాత తమిళ డబ్బింగ్ కోసం నా ఫుల్ ఎఫర్ట్ పెట్టిన సినిమా ఇదే అన్నారు విజయ్ దేవరకొండ. అంతగా బాగానే ఉంది కాని ఇక మీదట ప్రేమ కథల సినిమాలు చేయనని విజయ్ లాంటి హీరో చెప్పడం షాకింగ్ గానే ఉంది.