RRR ప్లేస్ లో కె.జి.ఎఫ్-2

ఎన్నో భారీ అంచనాలతో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా జూలై 30న రిలీజ్ ఎనౌన్స్ చేయగా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో సినిమాను 2021 జనవరి 8కి వాయిదా వేశారు చిత్రయూనిట్. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుండి కొన్ని అవాతరాలు చోటుచేసుకున్నాయి.. దాని వల్లే ఈ ఇయర్ రిలీజ్ అనుకున్న సినిమా నెక్స్ట్ ఇయర్ కు వాయిదా పడ్డది. 

ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఆ డేట్ ను లాక్ చేస్తున్నారట కె.జి.ఎఫ్ మేకర్స్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వల్ గా వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ముందు సమ్మర్ రిలీజ్ అనుకున్నా జూలై 30 ఏదైనా ఆర్.ఆర్.ఆర్ ఇంతకుముందు రిలీజ్ డేట్ అనుకున్నారో ఆ రోజున వచ్చేందుకు ఫిక్స్ అయ్యారట. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే లేటని తెలుస్తుంది. మరి ఆర్.ఆర్.ఆర్ ప్లేస్ లో వచ్చే కె.జి.ఎఫ్ ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.