RRR లో హంసా నందిని

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తూ ప్రేక్షకులను నిరాశపరచిన రాజమౌళి అండ్ టీం సినిమాలో మరో క్రేజీ స్టార్ ఉన్నాడని లీకులు ఇస్తూ వారిని శాంతపరుస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ ఉందని లేటెస్ట్ న్యూస్.

ఇంతకీ ఇంత ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న ఆ అమ్మడు ఎవరనేగా మీ డౌట్ ఆమె ఎవరో కాదు హంసా నందిని. ఆర్.ఆర్.ఆర్ లో హం సా నందిని కూడా స్పెషల్ రోల్ చేస్తుందని లేటెస్ట్ టాక్. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో హం సాని సెలెక్ట్ చేశాడట రాజమౌళి. ఆల్రెడీ రాజమౌళి ఈగ సినిమాలో హంసా నటించింది. ముందు హీరోయిన్ గా నటించిన హంసా నందిని ఆ అవకాశాలు రాకపోయే సరికి ఐటం సాంగ్స్ తో సరిపెట్టుకుంటుంది. మరి ఆర్.ఆర్.ఆర్ తో అమ్మడి ఫేట్ మారుతుందో లేదో చూడాలి.