
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాను కె.ఎస్ రామారావు సమర్పిస్తుండగా కే.ఏ వళ్లభ నిర్మించారు. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ త్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. టీజర్ లో అర్జున్ రెడ్డి తరహాలో అనిపించినా ట్రైలర్ తో కొత్త అనుభూతి కలిగించాడు విజయ్ దేవరకొండ.
నాలుగు ప్రేమకథలతో వస్తున్న ఈ సినిమాలో ఎప్పటిలానే విజయ్ దేవరకొండ తన మార్క్ చూపించాడని అనిపిస్తుంది. హీరోయిన్స్ నలుగురు ఈ మూవీకి ప్లస్ అయ్యేలా ఉన్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ట్రైలర్ తో మరింత అంచనాలు పెంచారు. డియర్ కామ్రేడ్ తో అంచనాలను అందుకోలేని విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్టు కొడతాడో లేదో చూడాలి.