సాయి పల్లవి ఏడాదికి అంత సంపాదిస్తుందా..?

మళయాళ మూవీ ప్రేమమ్ సినిమాతో సౌత్ లో ఓ సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది మలార్ అదేనండి సాయి పల్లవి. ప్రేమమ్ లో ఆమె పాత్రకు చేసిన అభినయం, డ్యాన్స్ ఆమెకు రావాల్సిన గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో ఫిదాతో మరింత క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. అయితే ఈమధ్య సరైన హిట్టు పడని ఈ అమ్మడు లేటెస్ట్ గా ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల వయసులో ఏడాదికి 30 కోట్లు సంపాదించే వారిలో సాయి పల్లవి పేరు ఉంది.

సినిమాకు కోటి, 2 కోట్లు మధ్యలో తీసుకునే సాయి పల్లవి ఏడాదికి 30 కోట్లు ఎలా సంపాదిస్తుందని అందరు డౌట్ పడుతున్నారు. ఒకవేళ ఆమె సినిమాకు అంత రెమ్యునరేషన్ తీసుకున్నా ఏడాదిలో 15 సినిమాలు చేయాల్సి ఉంటుంది. మరి ఈ అమ్మడికి సినిమా ఆదాయం కాకుండా వేరే ఏమైనా ఉందా అంటున్నారు. 30 ఏళ్ల లోపు 30 కోట్లు సంపాదిస్తున్న ఫోర్బ్స్ లిస్ట్ లో సాయి పల్లవి 15వ స్థానంలో ఉంది. దీనిలో కొందరు యూట్యూబ్ స్టార్స్ కూడా ఉండటం విశేషం. సాయి పల్లవితో సినిమాన్ అంటే అందులో సాంగ్స్ కూడా రికార్డులు కొట్టేస్తాయి.

ఫిదాలో వచ్చిండే సాంగ్ తో పాటుగా మారి 2లో రౌడీ బేబీ సాంగ్స్ అయితే యూట్యూబ్ ని షేక్ చేసేశాయి. కోట్ల కొద్ది వ్యూస్ తో సాయి పల్లవి మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో కూడా రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. తనకు నచ్చిన ప్రత్యేకమైన సినిమాలే చేస్తూ సెలెక్టెడ్ గా ఉంటున్న సాయి పల్లవి మునుముందు ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.