
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనులిద్దరు రాజమౌళి, ప్రభాస్. తెర వెనుక ఈయన బాహుబలి తీయగా తెర మీద ఆయన బాహుబలిగా జీవించాడు. ఈ ఇద్దరు కలిసి చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. అయితే బాహుబలి తర్వాత మళ్లీ రాజమౌళి, ప్రభాస్ కలిసి చేసే ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం రాజమౌళి, ప్రభాస్ కలిసి సినిమా చేస్తారట.
అయితే వారు చేసేది పెద్ద సినిమా కాదు చిన్న సినిమా.. అదేంటి అంటే రాజమౌళి, ప్రభాస్ కలిసి ఓ జాయింట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నారట. అయితే డైరక్టర్, హీరో కలిసి నిర్మాణ సంస్థ సిద్ధం చేశారని టాక్. ఇద్దరు కలిసి ఓ బ్యానర్ స్థాపించి టాలెంటెడ్ ఆర్టిస్టులు, డైరక్టర్స్ కు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. సో ప్రభాస్, రాజమౌళి ఇలా బ్యానర్ స్థాపించి ఎలాంటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.