
ఓ పక్క సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ తో ఉంటున్న మహేష్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏ.ఎం.బి సినిమాస్ అంటూ పెద్ద మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహేష్ కు బాగా కలిసి వచ్చిన బిజినెస్ గా అనిపిస్తున్న ఈ ఏ.ఎం.బిని ప్రస్తుతం విస్తరించే పనిలో ఉన్నారు మహేష్, నమ్రత. ముఖ్యంగా ఏ.ఎం.బి మాల్ లో ఎక్కువ క్రెడి నమ్రతకు దక్కుతుంది. అయితే హైదరాబాద్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ మల్టీప్లెస్ తో మహేష్ లాభాల పంట పడుతుందని తెలుస్తుంది.
అంతేకాదు హైదరాబాద్ లో రెస్పాన్స్ బాగుండటంతో ఈసారి బెంగుళూరులో ఏ.ఎం.బి మాస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. గ్రీన్ సిటీ బెంగుళూరులోని సాఫ్ట్ వేర్ హబ్ ల సమీపంలో ఈ మాల్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. మహేష్ ఇలా బిజినెస్ చేస్తున్నాడని తెలిసి అల్లు అర్జున్ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగాలని చూస్తున్నాడట.