18 ఏళ్ల తర్వాత 'జయం' రీమేక్..!

తేజ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా జయం. నితిన్, సదా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో గోపిచంద్ విలన్ గా నటించాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తున్నారట. ఆల్రెడీ ఆ సినిమా తమిళ, హింది భాషల్లో రీమేక్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా జయం సినిమాను కన్నడలో రీమేడ్ చేస్తున్నరట. డాక్టర్ వృత్తి చేసుకునే ప్రవీణ్ జయం సినిమాను రీమేక్ చేస్తున్నారట.

తెలుగులోనే కాదు ఈ సినిమా రీమేక్ చేసిన భాషల్లో కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. నితిన్ మొదటి సినిమా కాగా అదే సినిమాతో సదా కూడా తెలుగు తెరకు పరిచయమైంది. నితిన్, సదా జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ సినిమా హిట్ లో ప్రధాన అంశమని చెప్పొచ్చు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.