నాగ శౌర్య.. రాశి ఖన్నా.. ఐస్ స్క్రీం రిలేషన్

యువ హీరో నాగ శౌర్య రీసెంట్ గా అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా కంటెంట్ బాగున్నా దాన్ని తెరకెక్కించిన విధానంలో కొద్దిగా తడబడ్డారని టాక్ వచ్చింది. ఇదిలాఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ తో నాగ శౌర్యకు ఉన్న ఐస్ క్రీం రిలేషన్ బయటపెట్టాడు నాగ శౌర్య. నాగ శౌర్య, రాశి ఖన్నా ఇద్దరు ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరంగేట్రం చేశారు. 

ఆ సినిమా సక్సెస్ అవడం అప్పటి నుండి హీరోగా నాగ శౌర్య హీరోయిన్ గా రాశి ఖన్నా మంచి అవకాశాలు పొందడం జరుగుతుంది. అయితే నాగ శౌర్య, రాశి ఖన్నా ఆ సినిమా తర్వాత మళ్లీ కలిసి నటించే అవకాశం రాలేదు. అయినా సరే ఇప్పటికి వాళ్లిద్దరు టచ్ లోనే ఉన్నారట. నాగ శౌర్య రాశితో ఐస్ క్రీం తినడం ఇష్టమని.. మేము అక్కడే కలుస్తామని ఓపెన్ గా చెప్పాడు. కేవలం ఐస్ క్రీం తినడానికే అక్కడకు వెళ్తున్నారా లేక ప్రేమ పాఠాలు ఏమైనా నేర్చుకుంటున్నారా అన్నది మాత్రం వాళ్లకే తెలియాలి.