పవన్ సినిమాలో హాట్ యాంకర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా క్రిష్ డైరక్షన్ లో నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న క్రిష్ పవర్ స్టార్ తో పాన్ ఇండియా రేంజ్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా లో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

యాంకర్ గా బుల్లితెరను ఏలేస్తున్న అనసూయ ఓ పక్క సినిమా ఛాన్సులు అందుకుంటుంది. రాం చరణ్ రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది అమ్మడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందట. క్రిష్ ఈసారి పకడ్బందీ స్క్రిప్ట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.