
యాంకర్ గా బుల్లితెర మీద తన టాలెంట్ తో మెప్పిస్తున్న ప్రదీప్ మాచిరాజు మేల్ యాంకర్స్ లో సక్సెస్ అయ్యాడు. బుల్లితెర మీద తన సత్తా చాటుతున్న ప్రదీప్ హీరోగా తొలి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా నుండి మొదటి సాంగ్ నీలి నీలి ఆకాశం రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు విశేష స్పందన వస్తుంది. ఈ సాంగ్ లో ప్రదీప్ హీరోయిన్ అమృత అయ్యర్ ల అభినయం కూడా బాగుంది.
ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుండి కొద్దిగంటల్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం ఈ సాంగ్ 8 మిలియన్ వ్యూస్ సాధించగా ఒక స్టార్ హీరో సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు యూట్యూన్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. తొలి సినిమాగా ప్రదీప్ సినిమాను వెరైటీగా చేస్తున్నాడని ఈ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా వస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ అవనుంది.