నానీతో నాచురల్ బ్యూటీ

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ డైరక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. టాక్సీవాలా సినిమాతో సత్తా చాటిన డైరెక్టర్ నానితో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫైనల్ చేశారట. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో 'వి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. 

ఈ సినిమా తర్వాత నాని శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమా తర్వాత నాని రాహుల్ సినిమా వస్తుందని తెలుస్తుంది.  నాచురల్ స్టార్ గా నాని సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు. వి తో పాటుగా టక్ జగదీశ్ కూడా క్రేజీ మూవీ అవనుంది.. మరి ఈ రెండు సినిమాల తర్వాత నాని రాహుల్ తో ఎలాంటి కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడో చూడాలి.

నానితో సాయి పల్లవి ఆల్రెడీ MCA సినిమాలో నటించింది. ఇద్దరిది సూపర్ జోడీ.. ఇద్దరు తమ నాచురల్ యాక్టింగ్ తో ప్రతిభ చూపిస్తారు. మరి MCA సినిమా హిట్ మళ్లీ ఈ సినిమాతో అందుకుంటారో లేదో చూడాలి.