
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్నారట. నివేదా థామస్ కూడా ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా కన్ఫామ్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని ప్రకటించారు.
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా రీమేక్ అని వార్తలు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడు. అందికే ఆడియెన్స్ ని మిస్ గైడ్ చేయొద్దంటూ ట్వీట్ చేశాడు. మాములుగా హరీష్ శంకర్ కు రీమేక్ డైరెక్టర్ అని పేరు ఉంది. అందుకే పవన్ సినిమాని కూడా రీమేక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు దానికి హరీష్ శంకర్ గట్టిగానే రిప్లై ఇచ్చాడు.