మెగా-మంచు డిష్యుం డిష్యుం..!

మెగాస్టార్ చిరంజీవి, కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరి మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేది. మోహన్ బాబు కావాలని చిరంజీవిని టార్గెట్ చేయడం చిరంజీవి చూసి చూడనట్టు వదిలేయడం జరిగేది. అయితే చిరు మాట్లాడకపోయినా మిగతా మెగా హీరోలు మోహన్ బాబుతో డైరెక్ట్ ఎటాక్ చేశారు. అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు మోహన్ బాబు, చిరంజీవిల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈమధ్య జరిగిన 'మా' డైరీ రిలీజ్ వేడుకల్లో చిరు మోహన్ బాబుల మధ్య జరిగిన సంభాషణ అందరికి తెలిసిందే.

ఇదిలాఉంటే చిరంజీవి మోహన్ బాబుల మధ్య మళ్లీ గొడవ మొదలైందట. అయితే అది ఆన్ స్క్రీన్ పై కాదు ఆఫ్ స్క్రీన్ మీద అని తెలుస్తుంది. చిరు 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరుకి విలన్ గా మోహన్ బాబుని తీసుకోవాలని అనుకుంటున్నారట. అదే జరిగితే ఈ ప్రాజెక్ట్ కు ఈ విధంగా కూడా క్రేజ్ పెరిగినట్టే. సినిమా కోసం 20 కోట్లు పెట్టి సెట్ వేస్తున్నారట. సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. కెరియర్ స్టార్టింగ్ లో చిరు సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబోలో సినిమా వస్తుంది.