
ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఎవరికి వారు మాది ఇండస్ట్రీ హిట్ అంటే మాది బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుని ఈ సంక్రాంతి విన్నర్ ఎవరని అడిగితే మాత్రం తెలివైన సమాధానం చెప్పాడు.
కొన్ని ఏరియాల్లో సరిలేరు నీకెవ్వరు నాన్ బాహుబలి రికార్డులు కొడితే కొన్ని ఏరియాల్లో అల వైకుంఠపురములో రికార్డులు కొట్టింది. అయితే బాహుబలి 1, 2 రికార్డులను కూడా మహేష్, బన్నిలు కొన్ని ఏరియాల్లో కొల్లగొట్టారని అంటున్నాడు దిల్ రాజు. అయితే ఈ సినిమాలు తీసిన నిర్మాతల కన్నా రెండు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ఎక్కువ లాభాలు పొందాడని తెలుస్తుంది.