చిరంజీవి అక్కడే 60 రోజుల షూటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రాం చరణ్ తో పాటుగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఈ మూవీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది. ఈ మూవీ కోసం కోకాపేట రంగస్థలం సెట్ ను వాడేస్తున్నారట కొరటాల శివ.

రంగస్థలం కోసం వేసిన సెట్ నే కొద్దిగా మార్చి ఈ సినిమా కోసం వాడేస్తున్నారట. అంతేకాదు ఓ టెంపుల్ సెట్ కూడా వేస్తున్నారట. 60 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ అక్కడే జరుగుతుందట. ఈ రెండు నెలలు చిరంజీవి బ్రేక్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. అనుకున్న టైం గా షూటింగ్ పూర్తయ్యేలా కొరటాల శివకు చిరు టార్గెట్ పెట్టాడని తెలుస్తుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.