
కన్నడ కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత గీతా గోవిందంతో సత్తా చాటింది. మూడు నాలుగు సినిమాలతోనే స్టార్ రేంజ్ అందుకున్న రష్మిక మందన్న రీసెంట్ గా మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం నితిన్ కు జోడీగా భీష్మ సినిమాలో నటిస్తున్న రష్మిక ఆ సినిమా పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
నితిన్, రష్మిక జోడీ సూపర్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా షూటింగ్ విషయాలను పంచుకున్నాడు నితిన్. డైరక్టర్ వెంకీ కుడుములతో పనిచేయడం చాలా సరదాగా అనిపించిందని.. రష్మిక నా ఫేవరేట్ అయ్యిందని.. తన హార్డ్ వర్క్ అండ్ సపోర్ట్ సూపర్ అని అంటున్నాడు నితిన్. అంతేకాదు ఆమెతో మళ్లీ పనిచేయాలని అనుకున్నట్టుగా కామెంట్ పెట్టాడు నితిన్.