
మెగా డాటర్ నిహారిక కోణిదెల సిల్వర్ స్క్రీన్ పై అసలు లక్ కలిసి రాలేదని చెప్పాలి. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం సినిమాలు చేసిన నిహారిక ఆ మూడు సినిమాలతో ఫెయిల్యూర్ రిజల్ట్ అందుకుంది. టాలెంట్ ఉన్నా సరే అమ్మడికి మాత్రం ఒక్క హిట్టు పడట్లేదు. వెబ్ సీరీస్ లతో సత్తా చాటిన నిహారిక సినిమాల్లో మాత్రం రాణించట్లేదు. అయితే సినిమా హీరోయిన్ అంటే కేవలం అభినయమే కాదు కొద్దిపాటి గ్లామర్ షో కూడా ఉండాలని అనుకుంది కాబోలు అమ్మడు ఈమధ్య తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.
లేటెస్ట్ గా నిహారిక పిక్స్ చూసి మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. నిహారిక హాట్ అవతార్ చూసి అందరు అవాక్కవుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ ఇలా చేయడం ఏంటని అనుకునే వారి కన్నా నిహారిక కూడా రెగ్యులర్ హీరోయిన్స్ లా ఆలోచించడం గొప్ప విషయమని పొగిడే వారు ఉన్నారు. అయినా గ్లామర్ గా కనిపించడం తప్పేం కాదు. మరి ఎందుకు ఈ ప్రయత్నమో కాని నిహారిక గ్లామర్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.