మహేష్ తో లక్కీ ఛాన్స్

సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అవడంతో మహేష్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుంటున్న మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో జాలీ ట్రిప్ లో ఉన్నాడు. మహేష్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపిస్తాడట. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడని తెలుస్తుంది. ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా కియరా అద్వానిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ఆల్రెడీ భరంత్ అనే నేను సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా ఆ తర్వాత రాం చరణ్ వినయ విధేయ రామ సినిమా చేసింది.

ఈమధ్య బాలీవుడ్ లో బిజీగా మారిన కియరా మహేష్ సినిమాతో మళ్లీ ఇక్కడకు వస్తుంది. ఇక మహేష్ 27వ సినిమాలో మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నారట. సవ్యసాచి, మిస్టర్ మజ్ ను సినిమాలు ఫ్లాప్ అయినా రాం ఇస్మార్ట్ శంకర్ హిట్ తో నిధికి సూపర్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్న ఈ అమ్మడికి మహేష్ సినిమాలో ఛాన్స్ రావడం అదృష్టమని చెప్పొచ్చు.