
అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో సంక్రాంతికి వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. క్రేజీ మూవీగా వచ్చిన ఈ సినిమా సెసేషనల్ హిట్ అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులను సైతం తిరగరాస్తూ ఈ సినిమా ఇంకా వసూళ్ల పరంగా తన హవా కొనసాగిస్తుంది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టిన సందర్భంగా చిత్రయూనిట్ మరోసారి థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా అల్లు అర్జున్ ఈ సినిమా రికార్డుల గురించి ప్రస్థావించి ఈ రికార్డులు త్వరలోనే బద్ధలు కొట్టే సినిమా రావాలని.. అప్పుడే పరిశ్రమ ముందుకెళ్తుందని అన్నారు. ఇలా మాట్లాడటం బాగున్నా అసలు రికార్డుల గురించి మహేష్ సరిలేరు నీకెవ్వరుతో పోటీ పడిన విషయాన్ని బన్ని మర్చిపోయాడా అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సభా ముఖంగా తన రికార్డులు కొట్టే సినిమా త్వరలోనే రావాలని చెప్పడంతో బన్ని ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు. సినిమాకు పనిచేసిన ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ టీం అందరికి తన కృతజ్ఞతలు తెలిపాడు.