
ఖుషి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యన్ పదేళ్ల వరకు సక్సెస్ లేదు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. హరీష్ శంకర్ కు ఆ సినిమాతో స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ సాయి తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లతో సినిమాలు చేశాడు.
లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ మెగా హీరోతో సినిమా చేస్తాడని చెప్పుకొచ్చిన హరీష్ శంకర్ ఫైనల్ గా మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సినిమా కన్ఫాం చేసుకున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత పింక్ రీమేక్ గా ఒక సినిమా.. క్రిష్ డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఇక మూడవ సినిమా కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ కాంబోలో సెన్సేషనల్ మూవీ వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. పవర్ స్టార్ అభిమానిగా హరీష్ శంకర్ ఈసారి ఆయనతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.