జూనియర్ సమంత అంటున్నారే..!

ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత అప్పటి నుండి తెలుగు ఆడియెన్స్ ను మాయ చేస్తూనే ఉంది. పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ కు పెద్దగా డిమాండ్ ఉండదు కాని సమంత మాత్రం అక్కినేని కోడలుగా మారాక కూడా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫాం కొనసాగిస్తుంది. ఇక సమంత ఫేడవుట్ అవడం అన్నది ఇప్పుడప్పుడే జరగదు కాని సమంత లాంటి మరో అమ్మాయి మాత్రం ఇండస్ట్రీకి వస్తున్నట్టు తెలుస్తుంది. 

కోలీవుడ్ లో కాళి, బిగిల్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన అమృతా అయ్యర్ తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడమ్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా నుండి అమృతా అయ్యర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే అచ్చం సమంతని చూసినట్టే ఉంది. ఈ పోస్టర్ చూసిన వారంతా జూనియర్ సమంత అనేస్తున్నారు. రెడ్ సినిమాతో పాటుగా యాంకర్ ప్రదీప్ హీరోగా చేస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమాలో కూడా అమృతా అయ్యర్ నటిస్తుంది.